- Advertisement -
నవతెలంగాణ చర్లపల్లి: హైదరాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. రైలు కిందపడి ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చర్లపల్లి- ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. మృతులను బోడుప్పల్ కు చెందిన సురేందర్ రెడ్డి, విజయ, చేతనగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -



