నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఎంతగా దిగజారిందో మరోసారి తెటతేల్లమైంది. తన మిత్ర దేశాల వద్దకు వెళ్లి ప్రతిసారీ సాయం కోరడం చాలా అవమానకరంగా ఉందని ప్రధాని షెహబాజ్ షరీఫే ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు తీసుకోవడం ఆత్మగౌరవానికి పెద్ద దెబ్బగా ఉందని, డబ్బులు ఇచ్చేవారు ఏం డిమాండు చేసినా అడ్డు చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆ దేశంలో ఓ మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో చెప్పారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోవడంపై షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఆర్థికసాయం అందించిన దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉందన్నారు. అయితే కొన్ని దేశాలు తమ నుంచి పరిస్థితులతో సంబంధం లేకుండా పాక్కు మద్దతుగా నిలిచిన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, చైనా వంటి మిత్ర దేశాలన్నింటికీ ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
పాక్ విదేశీ రుణాలపై ప్రధాని షెహబాజ్ షరీఫే కీలక వ్యాఖ్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



