నవతెలంగాణ-హైదరాబాద్: బేగంపేట్ టూ సికింద్రాబాద్ వెళ్లే రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. బేగంపేట్ విమానాశ్రయంలో ఎయిర్ షో నడుస్తుండటంతో ఎయిర్ పోర్ట్‌కు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. దీంతో ఈ మార్గంలో వాహనాల రద్దీ పెరిగి భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగంలో దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేస్తున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో ‘వింగ్స్ ఇండియా –2026’కు హైదరాబాద్ వేదికైంది. ప్రపంచ విమానయాన భవిష్యత్తును ప్రదర్శించేలా బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో ఈ నెల 28 నుంచి 31 వరకు ఈ షో జరుగుతోంది. ‘భారతీయ విమానయానం’ థీమ్‌తో ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది.



