నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. శనివారం (జనవరి 31) తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. ప్లేయింగ్ 11లో ఇషాన్ కిషాన్, అక్షర్ పటేల్ కు ఛాన్స్ దక్కింది.
న్యూజిలాండ్ : టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్(c), కైల్ జామిసన్, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ ఇండియా :అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా



