- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రేపు ప్రధాని మోడీ పంజాబ్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జలంధర్‌లోని డేరా సచ్‌ఖండ్ బల్లాన్, రెండు పాఠశాలలకు శనివారం ఇమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. డేరా బాలన్‌కు మాత్రం ప్రత్యక్ష బెదిరింపు వచ్చింది. సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు బాంబు స్క్వాడ్లను పిలిపించి పాఠశాలల ఆవరణలో తనిఖీలు నిర్వహించారు. అయితే పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గురు రవిదాస్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి ఆదివారం డేరా బాలన్‌ను సందర్శించనున్నారు. బెదిరింపులు వచ్చిన ఆ ఇమెయిల్‌ను పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.
- Advertisement -



