నవతెలంగాణ-హైదరాబాద్ : దేశరాజధానిలో ఆదివారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. చాలా రోడ్లు, అండర్‌పాస్‌లు నీటితో నిండిపోవడంతో..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాతావరణం అనుకూలంగా లేని కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా .. మరో 49 విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాల సమయాలను సంబంధిత వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవాలని సూచించింది.
అటు ఎయిరిండియా, ఇండిగో కూడా ప్రయాణికులకు అలర్ట్‌లు పంపించాయి. తాజా అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి. శనివారం అర్థరాత్రి కురిసిన వర్షానికి దిల్లీ నగరాన్ని విమానాశ్రయానికి అనుసంధానించే ప్రధాన అండర్‌పాస్ జలమయమవ్వడంతో డజన్ల కొద్దీ కార్లు, బస్సులు నీటమునిగాయి. రానున్న కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఢిల్లీలో కుండపోత వర్షం..నిలిచిన 100కి పైగా విమానాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES