నవతెలంగాణ-వనపర్తి
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డి) వనపర్తి జిల్లా నూతన కమిటీ ఆదివారం ఎన్నుకున్నారు. ఎన్‌పీఆర్‌డి వనపర్తి జిల్లా సదస్సు నిర్వహించుకోగా.. ఈ సదస్సుకు 10 మండలాల నుండి ఎన్పిఆర్డి సభ్యులు హాజరయ్యారు. వనపర్తి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా బి బంగారయ్య నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆడం లక్ష్మి కార్యదర్శి మల్లెపు నరసింహ ఉపాధ్యక్షులు ఆంజనేయులు కోశాధికారి చెన్నయ్య మహిళా విభాగం కన్వీనర్ భాగ్యలక్ష్మి పార్వతమ్మ భాగ్యమ్మ నాగమ్మ నారాయణ చంద్రాయుడు కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎన్‌పీఆర్‌డి రాష్ట్ర కమిటీ సభ్యురాలు శశికళ హాజరై మాట్లాడారు. వికలాంగుల సమస్యల పైన మహిళా వికలాంగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మాట్లాడారు. ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని వారు మాట్లాడారు. విద్యా ఉపాధి వికలాంగులకు రూ.6000 పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు.



