Sunday, February 1, 2026
E-PAPER
Homeక్రైమ్విషాదం..అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి

విషాదం..అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : మెదక్ జిల్లా దుద్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలేపల్లికి చెందిన మాధురి (25) అనే నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మూడు నెలల క్రితం నరేందర్ రెడ్డితో వివాహమైన మాధురి, శనివారం వేరుసెనగ పొట్టు తీయడానికి పిలిచిన భర్తతో కుంట వద్ద బట్టలు ఉతుక్కుంటానని చెప్పి వెళ్లింది. వ్యవసాయ పనులు ముగించుకుని భర్త కుంట వద్దకు వచ్చేసరికి, మాధురి అందులో పడి మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే, మృతురాలి తల్లి వనజ తమ కూతురిది హత్యేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -