- Advertisement -
నవతెలంగాణ న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉందని సీపిఐ(ఎం) ఆరోపించింది. శ్రామిక ప్రజలు, సామాజికంగా అణచివేతకు గురైన వర్గాలను, అలాగే విస్తృత జాతీయ ఆర్థిక ప్రయోజనాలను పణంగా పెట్టి, కొన్ని పెద్ద వ్యాపార సంస్థలు, ధనవంతుల సంకుచిత ప్రయోజనాలను ప్రోత్సహించడంలో మోడీ ప్రభుత్వం సఫలమైందని సీపీఐ(ఎం) విమర్శించింది.
- Advertisement -



