Monday, February 2, 2026
E-PAPER
Homeజాతీయంపార్లమెంట్‌ ఆవరణలో కేరళ ఎంపీల నిరసన..

పార్లమెంట్‌ ఆవరణలో కేరళ ఎంపీల నిరసన..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం పార్లమెంట్‌ ఆవరణలో వారు నిరసనకు దిగారు. కేంద్ర బడ్జెట్‌ పూర్తిగా కేరళ వ్యతిరేక బడ్జెట్‌ అని వారు మండిపడ్డారు. బడ్జెట్‌లో కేరళకు అన్యాయం జరిగిందని విమర్శించారు. బడ్జెట్‌లో కేరళ పేరును కూడా ప్రస్తావించకపోవడం దారుణమని అన్నారు. కేరళకు ఆయుర్వేద యూనివర్సిటీ కేటాయిస్తారని ఆశించామని, కేంద్ర మంత్రి ఆయుర్వేద యూనివర్సిటీని స్థాపించనున్నట్లు ప్రకటించినా, అది ఎక్కడ అనే విషయం మాత్రం వెల్లడించలేదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -