Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాథమిక చికిత్స కేంద్రాల తనిఖీ 

ప్రాథమిక చికిత్స కేంద్రాల తనిఖీ 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి మరియు దేవరకొండ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ఆదేశానుసారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారులు సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న ప్రాథమిక చికిత్స కేంద్రాలు (ఆర్.ఎం.పి దావఖానలను) తనిఖీ చేయడం జరిగింది. నిబంధనలకు వ్యతిరేకంగా క్లినిక్ కు వచ్చిన రోగులకు అధిక మోతాదులో యాంటీబయటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్ఎంపీ డాక్టర్లకు హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే వారం లో దేవరకొండ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సూచనల మేరకు మండలంలోని ఆర్ఎంపీ డాక్టర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు డాక్టర్ శాలిని,డాక్టర్ దీపక్,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -