– జనహృదయనేత జన్మదిన వేడుకలు జయప్రదం చేయండి
– ఊర్కొండ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరారెడ్డి
నవతెలంగాణ – ఊరుకొండ
మాజీ మంత్రి వర్యులు, జడ్చర్ల మాజీ శాసనసభ్యులు చర్లకోల లక్ష్మారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం ఊరుకొండ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువజన విభాగం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఊర్కొండ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ద్యాప వీరారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ద్యాప వీరారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ..జడ్చర్ల పట్టణంలోని ప్రేమ్ రంగా గార్డెన్ లో మంగళవారం ఉదయం 10 గంటలకు చర్లకోల లక్ష్మారెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఊర్కొండ మండలం రక్తదానం చేయడంల్లో ముందు ఉండాలని.. అత్యధిక మంది రక్తదానం చేసి విజయవంతం చేయాలని కోరారు. మండలంలోని ఊర్కొండపేట మాజీ సర్పంచ్ కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఊర్కొండపేట పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయంలో లక్ష్మారెడ్డి పేరు పైన అర్చన అభిషేకం మరియు ప్రత్యేక పూజలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఊర్కొండ మండల కేంద్రంలోని బస్టాండ్ దగ్గర కేక్ కటింగ్ ఉంటుందని తెలిపారు.
ఊర్కొండ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నూతన సర్పంచ్ లను, ఉప సర్పంచ్ లను, వార్డు మెంబర్లను, సర్పంచ్,గా పోటీ చేసిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుకు సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఊర్కొండ మండల ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు యువజన విభాగం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జనహృదయనేత జన్మదిన వేడుకలు జయప్రదం చేయాలని కోరారు.



