Tuesday, February 3, 2026
E-PAPER
Homeఆటలుమరో వివాదం..పాక్ జెర్సీపై ఐఎస్ఐ లోగో

మరో వివాదం..పాక్ జెర్సీపై ఐఎస్ఐ లోగో

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ జట్టు వివాదం రేపిన విషయం తెలిసిందే. ఓవైపు దీనిపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ఆటగాళ్ల కోసం పాక్ సిద్ధం చేసిన జెర్సీపై మరో వివాదం రేగింది. టీ20 వరల్డ్ కప్ కోసం సిద్ధం చేసిన పాకిస్థాన్ జెర్సీపై అటవీ మేక ‘మార్ఖోర్’ బొమ్మ కనిపించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆకుపచ్చ రంగులో ఉన్న జెర్సీపై మధ్యలో నల్లటి రంగులో మార్ఖోర్ చిత్రాన్ని ప్రింట్ చేశారు. పాకిస్థాన్ జాతీయ జంతువు మార్ఖోర్.. అదే విధంగా ఇదే చిహ్నాన్ని ఆ దేశ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కూడా ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్ ఆటగాళ్ల కోసం రెడీ చేసిన జెర్సీపై మార్ఖోర్ బొమ్మ కనిపించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -