- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరొందిన సీఎస్కే.. WPLలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. భవిష్యత్‌లో విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పెట్టుబడులు పెట్టడానికి తమకు స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయని ప్రకటించారు. భవిష్యత్‌లో ఇతర క్రీడల్లో కూడా తమ ఫ్రాంచైజీ విస్తరించే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం WPLలో ఐదు జట్లు ఆడుతున్నాయి.
- Advertisement -



