నవతెలంగాణ-హైదరాబాద్ : శిరోమణి అకాళీదల్ నేత, పంజాబ్ మాజీ మంత్రి బిక్రం సింగ్ మజితియా ఇవాళ నాభా జైలు నుంచి బయటకు వచ్చారు. అక్రమాస్తులు కలిగి ఉన్న కేసులో సోమవారం సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరీ చేసిన విషయం తెలిసిందే. న్యాయపరమైన ప్రక్రియ వల్ల మతిజియా రిలీజై ఆలస్యమైంది. ఆయనకు స్వాగతం పలికేందుకు భార్యతో సహా పార్టీ వర్కర్లు జైలు వద్దకు వెళ్లారు. జైలు నుంచి బయటకు రాగానే మజితియా తన సహజరీతిలో మీసాలను మెలేశారు. ఓపెన్ టాప్ జీప్‌లో తన మద్దతుదారులతో కలిసి వెళ్లారు.
దాదాపు రూ.700 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నారని శిరోమణి అకాళీదల్ నేత బిక్రం సింగ్ మజితియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీం ధర్మాసనం సోమవారం బెయిల్‌పై ఆదేశాలు జారీ చేసింది. కేసు పూర్వాపరాలు, విచారణ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం పేర్కొంది.



