– ప్రజా సమస్యలపై ఐక్య ఉద్యమాలు చేపట్టాలి
– ఎర్రజెండాతో పెట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోతారు
– ఆదివాసీల సంపద కొల్లగొట్టేందుకే ఆపరేషన్ కగార్ : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– జనగామలో గబ్బెట గోపాల్‌రెడ్డి స్థూపం ఆవిష్కరణ, బహిరంగ సభ
నవతెలంగాణ-జనగామ
ప్రజా సమస్యల పరిష్కారం కోసం పేదలు సంఘటితం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, జనగామ నియోజకవర్గ మొట్టమొదటి శాసన సభ్యులు గంగసాని(గబ్బెట) గోపాల్ రెడ్డి స్మారక స్థూపాన్ని జాన్‌వెస్లీ ఆవిష్కరించారు. అనంతరం గోపాల్‌నగర్ చౌరస్తా నుంచి బచ్చన్నపేట చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ సెంటర్ వద్ద గోపాల్‌నగర్ శాఖ కార్యదర్శి పర్వతం నరసింహులు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో జాన్‌వెస్లీ మాట్లాడారు. నాడు సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో గోపాల్ రెడ్డి కీలక భూమిక పోషించారని తెలిపారు. ఎర్రజెండా నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం లో భూస్వాముల భూములు గుంజుకొని పది లక్షల ఎకరాల భూమిని పేదలకు అందించిన చరిత్ర ఎర్రజెండా దని అన్నారు. ఆంధ్రమహాసభలో గోపాల్‌రెడ్డి సభ్యునిగా ఉండి బచ్చన్నపేట ప్రాంతంలో ఇండ్ల స్థలాలు, సాగు భూములు పంచి పెట్టిన గొప్ప మహానేత అని కొనియాడారు. జనగామ నియోజక వర్గానికి మొట్టమొదటి శాసనసభ్యులుగా ఎన్నికై జనగామ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవలు అందించినట్టు చెప్పారు. దోపిడీ ఉన్నంతకాలం ఎర్రజెండా ప్రజల కోసం పోరాటాలు నిర్వ హిస్తూనే ఉంటుందన్నారు. ఎర్రజెండాతో పెట్టుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయని తెలిపారు. రాబోయే కాలమంతా ఎర్ర జెండా రాజ్యమేనని అన్నారు. నాటి అమరవీరుల త్యాగాలను, వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందిం చడం కోసమే ఇలాంటి స్థూపాలు నెలకొల్పుతున్నట్టు చెప్పారు. పేదరిక నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు. పేదరికం తొలగిపోవాలంటే ప్రభుత్వాలు విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకొచ్చిన ప్రభుత్వాలు స్వార్థం కోసం పాలన సాగిస్తూ దేశ సంపదను దోచుకుం టున్నాయన్నారు. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హత్యాకాండను కొనసాగిస్తున్నదని జాన్‌వెస్లీ విమర్శించారు. అడవిలో ఉన్న వనరులను కొల్లగొట్టేందుకే ఈ ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజలంతా సంఘటితమై సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ.. ఆపరేషన్ కగార్ పేరుతో అటవీ సంపదను అదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం యత్నిస్తున్నదని అన్నారు. ఆదివాసీలపై అకారణంగా కాల్పులు జరుపుతూ ఎన్‌కౌంటర్ల పేరుతో గిరిజనులు, ఆదివాసులను పొట్టన పెట్టుకుంటున్నదని విమర్శించారు. ఇప్పటికైనా ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని, ఆదివాసుల భూము లను రక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, బొట్ల శేఖర్, బచ్చన్నపేట మండల ఇన్‌చార్జి సుంచు విజేందర్, జిల్లా కమిటీ సభ్యులు జోగు ప్రకాష్, మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ షబానా, జిల్లా నాయకులు గుండె బోయిన రాజు, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పేదలు సంఘటితం కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES