నవతెలంగాణ-హైదరాబాద్: వెస్ట్‌బ్యాంక్‌లో కొనసాగుతున్న భయంకరమై హింసాకాండపై ఐక్యరాజ్యసమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతంలో నిశ్శబ్ధ యుద్ధం జరుగుతోందని సోమవారం హెచ్చరించింది. 2023 అక్టోబర్ నుండి వెయ్యిమందికి పైగా ప్రజలు, వారిలో మూడో వంతు మైనర్లు మరణించారని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల సహాయ సంస్థ (యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ) కమిషనర్ జనరల్ ఫిలిప్పి లాజారినీ పేర్కొన్నారు. ఇజ్రాయిల్ స్థిరనివాసులు ఈప్రాంతంలో దాడులను కొనసాగిస్తున్నారని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా గాజాపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ, వెస్ట్ బ్యాంక్‌లో అంతర్జాతీయ మానవతా చట్టం పట్ల తీవ్ర నిర్లక్ష్యం సాధాకరణీకరించబడిందని, మరింత తీవ్రతరం కాకముందే దీన్ని ఆపాలని ఎక్స్‌లో పేర్కొన్నారు. తూర్పు జెరూసలెంలోని తమ కార్యాలయాన్ని ఇజ్రాయిల్ సైన్యం కూల్చివేయడం, నిప్పుపెట్టడంతో పాటు అదనంగా ప్రాధమిక అవసరాలైన నీరు, విద్యుత్‌ను నిరోధించిందని మండిపడింది. ఆ ప్రాంతంలో తమ సేవలు కొనసాగిల్సిన అవసరం ఉందని సంస్థ ఉద్ఘాటించింది.
జెరూసలెం గవర్నరేట్‌లోని అల్-ఐజరియా నగరం చుట్టూ బైపాస్ రోడ్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించడం .. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిల్ దాడి క్రమంగా పెరగాన్ని సూచిస్తుందని పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ జనవరి 28న హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ వలసవాద చర్య ప్రాదేశిక విచ్ఛిన్నతను మరింత తీవ్రతరం చేయడానికి మరియు పాలస్తీనా ప్రజలను ఒంటరిగా చేయడానికి బెదిరించే విస్తృత ప్రణాళికలో భాగమని అధికారులు హెచ్చరించారు. పాలస్తీనా ప్రజలపై కొనసాగుతున్న యుద్ధం చట్రంలో ఈ విధానాలు ప్రమాదకరమైన వ్యూహాన్ని కలిగి ఉన్నాయని పాలస్తీనా నేత నబిల్ అబు రుదెనెహ్ ఖండించారు. పాలస్తీనియన్ కమ్యూనిటీలను వేరు చేయడం, వేర్వేరు మార్గాలను వినియోగించాలని వారిపై ఒత్తిడి తీసుకురావడం మరియు ప్రధాన రవాణా మార్గాలను అడ్డుకోవడం ఈ రహదారి నిర్మాణం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.



