- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
బాల్కొండ మండల పరిధిలోని జలాల్ పూర్, శ్రీరాంపూర్ గ్రామాలను మంగళవారం సెంట్రల్ స్పెషల్ ఏజి ఆడిట్ బృందం సందర్శించారు. ఈ సందర్భంగా జలాల్ పూర్ లోని మిషన్ భగీరథ గ్రిడ్, వాటర్ ట్యాంకులను పరిశీలించారు. అలాగే గ్రామాలలో డ్రైనేజ్,డంపింగ్ యార్డు,వాటర్ శానిటేషన్ పనులను తనిఖీ చేశారు.గ్రామపంచాయతీలలో కేంద్ర ప్రభుత్వ , రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై సర్పంచులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ స్పెషల్ ఈజీ ఆడిట్ అధికారులు ఎం కొండయ్య, వంశీ, కళ్యాణ్, ఎంపీఓ గంగామోహన్, జలాల్ పూర్ సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి, శ్రీరాంపూర్ ఉప సర్పంచ్ పెద్ది విలాస్,కార్యదర్శులు దేవేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



