– ఎన్డీఏ సమావేశంలో ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆపరేషన్ సిందూర్‌పై ఎన్డీఏ సమావేశంలో తీర్మానం చేశారు. ప్రధాని మోడీ అధ్యక్షతన ఆది వారం అశోకా హౌటల్‌లో భాగస్వామ్య పక్షాల సమావేశాన్ని నిర్వహించారు. కేంద్రంలో ఎన్డీఏ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరిగింది. మోడీ 3.0లో ఏడాది పాలన, ఆపరేషన్ సిందూర్, దేశ భద్రత సహా పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీి నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్, 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ఉప ముఖ్య మంత్రులు పాల్గొన్నారు. ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం ఆపరేషన్ సిందూర్‌పై తీర్మానాన్ని ఆమోదించింది. ఆపరేషన్ సిందూర్ విజయంలో సాయుధ బలగాలు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసా లను, ప్రధాని మోడీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఈ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని శివసేన నేత, మహారాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ఏక్‌నాథ్ శిండే ప్రవేశపెట్టారు. ఆపరేషన్ సిందూర్‌తో దేశ ప్రజల్లో నైతిక, ఆత్మస్థైర్యం పెరిగిందని ఈ తీర్మానం పేర్కొన్నది. మోడీ నాయ కత్వాన్ని ప్రశంసిస్తూ, సాయుధ బలగాలను ప్రధా ని వెన్నంటి ప్రోత్సహిస్తూ వచ్చారనీ, ఉగ్రవాదులు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహి స్తున్న వారికి ఆపరేషన్ సిందూర్ గట్టి సమాధానం ఇచ్చిందని వివరిం చింది. పలువురు రాష్ట్ర మంత్రులు తమతమ రాష్ట్రాల్లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకాలను ఈ సమావేశంలో వివరించారు. ఏప్రిల్ 22న పహ ల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఘనంగా నివాళులర్పించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ఈ సమావేశం జరిగింది.
నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ: పవన్
భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. నిటి ఆయోగ్ ప్రకారం భారత జీడీపీ ప్రస్తుతం 4.18 ట్రిలియన్‌కు చేరుకుందని గుర్తుచేశారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని ప్రధాని మోడీ దూరదృష్టి గల నాయకత్వం, అలాగే 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వ ప్రగతిశీల పాలన నిదర్శనంగా చెప్పుకోవచ్చని తెలిపారు. గత దశాబ్దంలో, ఎన్డీఏ ప్రభుత్వ సుపరిపాలన కింద, భారత్ అభివృద్ధి పయనాన్ని నాలుగు ముఖ్యమైన అంశాలు నడిపించాయని వివరించారు. భారత్ వృద్ధి కథ, ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, చేరిక, డిజిటల్ పరివర్తనతో నడిచిందని అన్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి, వికసిత్ భారత్ – 2047 వైపు నడిపించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగని పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు.
ఆపరేషన్ సిందూర్‌పై తీర్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES