Wednesday, February 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రణీత్‌రావు డీఎస్పీ హోదా రద్దు

ఫోన్ ట్యాపింగ్ కేసు..ప్రణీత్‌రావు డీఎస్పీ హోదా రద్దు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక నిందితుడు, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న దుగ్యాల ప్రణీత్‌రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఎస్పీగా పదోన్నతి పొందిన అనంతరం ప్రొబేషన్‌ కాలంలో విధుల దుర్వినియోగానికి పాల్పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.వి.ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గతంలో ప్రణీత్‌రావుకు కల్పించిన యాక్సిలరేటెడ్‌ పదోన్నతి రద్దయినట్లయింది. ఇకపై ఆయన ఇన్‌స్పెక్టర్‌గానే కొనసాగనున్నారు. సాధారణంగా తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో ప్రతిభ కనబరిచిన పోలీస్‌ అధికారులకు మాత్రమే యాక్సిలరేటెడ్‌ పదోన్నతి కల్పించే విధానం రాష్ట్రంలో అమల్లో ఉంది. అలాంటి కార్యకలాపాల్లో పనిచేయకపోయినా ప్రణీత్‌రావుకు డీఎస్పీగా పదోన్నతి కల్పించడం అప్పట్లో కలకలం రేపింది. 2007 ఎస్సై బ్యాచ్‌లో దాదాపు 300 మంది ఉండగా.. ఒక్క ప్రణీత్‌రావుకు మాత్రమే డీఎస్పీగా పదోన్నతి కల్పించడం వివాదానికి దారితీసింది. కేవలం ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడినందుకే ప్రణీత్‌రావును అందలం ఎక్కించారనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -