
నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : దుబ్బాక నియోజకవర్గం లో కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన బీఆర్ఎస్దే గెలుపని, ఈసారి కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమని బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పెద్ద గుండవెల్లి గ్రామంలో, మున్సిపాలిటీ పరిధిలోని దుంపలపల్లి 3,4 వార్డులో మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా పెద్దగుండ వెళ్లి గ్రామ సర్పంచ్ సద్దిరాజిరెడ్డి, పార్టీ నాయకులు చేపూరి శేఖర్ గౌడ్, చిన్ని సంజీవరెడ్డి లతో కలిసి ఇంటింటా తిరుగుతూఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నట్లు ప్రజలు చెబుతున్నారన్నారు. ఈ సారి సీఎం కేసీఆర్ తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించడం ఖాయమని అన్నారు. దుబ్బాక గడ్డపై ఓడిపోతున్నామని తెలుసుకున్న బిజెపి కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని, తమ కార్యకర్తలపై బిజెపి కాంగ్రెస్ నాయకులు ప్రచారంలోదాడి చేయడాన్ని వారు ఖండించారు. అధికారం కోసం ప్రతిపక్షాలు చేసే జిమ్మిక్కులను ప్రజలు తిప్పుకొడతారన్నారు. కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లు గారి ప్రేమ్, రవి, పంజ సత్యం, కొత్త దేవి రెడ్డి, సాయి, బుచ్చి రెడ్డి, మల్లారెడ్డి తదితరులున్నారు.