Wednesday, February 4, 2026
E-PAPER
Homeజాతీయంస‌ర్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ‌..స్వ‌యంగా హాజ‌ర‌కానున్న సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

స‌ర్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ‌..స్వ‌యంగా హాజ‌ర‌కానున్న సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్: ప్ర‌త్యేక స‌మ‌గ్ర ఓట‌ర్ జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌పై ప‌శ్చిమ బెంగాల్ సీఎం స‌మ‌ర శంఖం పూరించారు. దేశ చరిత్రలో మొదటి సారి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా లాయర్ గా మారి కోర్టులో వాదించనున్నారు. ఇవాళ స‌ర్ స‌ర్వేను వ్య‌తిరేకిస్తూ ఆమె పిటిష‌న్‌పై సుప్రీంకోర్డులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. విచార‌ణ సంద‌ర్భంగా ఆమె స్వ‌యంగా కేసు విచార‌ణ‌కు హాజ‌రై..కోర్టుకు త‌న అభిప్రాయం వెల్ల‌డించ‌నుంది.సుప్రీంకోర్టులో “పార్టీ-ఇన్-పర్సన్” (Party-in-person) గా వాదించేందుకు ఆమె అనుమతి కోరారు. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి ఇలా కోర్టులో స్వయంగా వాదనలు వినిపించడం దేశ చరిత్రలోనే ఇదే ప్రథమం కావడంతో న్యాయ, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -