Wednesday, February 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపరకాలలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ..

పరకాలలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ..

- Advertisement -

– బీఆర్ఎస్ గూటికి 14వ వార్డు అభ్యర్థి సుష్మ
నవతెలంగాణ -పరకాల 

మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకున్న తరుణంలో పరకాలలో భారతీయ జనతా పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పట్టణంలోని 14వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బొల్లెడ్ల సుష్మ కృపేందర్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు. బుధవారం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రాష్ట్ర బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సమక్షంలో ఆమె గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

బీఆర్ఎస్ హయాంలో పరకాల పట్టణంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పారదర్శక పాలనకు ఆకర్షితురాలినై ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుష్మ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. పరకాలలో బీఆర్ఎస్ బలం నానాటికీ పెరుగుతోందని, ఇతర పార్టీల నేతలు స్వచ్ఛందంగా పార్టీలోకి రావడం తమ పాలనపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఘనవిజయం సాధించడం ఖాయమని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు యువజన విభాగం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -