Wednesday, February 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్పీక‌ర్‌పై కేటీఆర్ ఫైర్

స్పీక‌ర్‌పై కేటీఆర్ ఫైర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్: బీఆర్ ఎస్ కు చెందిన 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు ఆదేశాల‌తో పార్టీ ఫిరాయింపు ఆరోప‌ణ‌ల‌పై స్పీక‌ర్ విచార‌ణ చేప‌ట్టి ఇప్ప‌టికే స‌దురు ఎమ్మెల్యేల‌కు క్లీన్ చీట్ ఇచ్చారు. పార్టీ మారిన‌ట్లు ఎలాంటి ఆధారాలు లేవ‌ని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

పంచాయతీ ఎన్నికల్లో తగిలిన ఘోరమైన ఎదురుదెబ్బతో కోలుకోని కాంగ్రెస్ పార్టీ బైఎలక్షన్స్ అంటే భయపడుతోందని అర్థమైపోయింద‌న్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి వైఫల్యాలు, మోసాలపై పట్టణ ప్రజల్లో పెద్దఎత్తున వెల్లువెత్తుతున్నా.. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినా ఒక్కరిపై కూడా చర్య తీసుకోకుండా సీఎం నడిపిస్తున్న ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం తప్పదు.” అని ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -