Wednesday, February 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు ముగ్గు వేసి పనులను ప్రారంభించిన ఎంపీడీవో

ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు ముగ్గు వేసి పనులను ప్రారంభించిన ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని బస్వాపూర్ గ్రామపంచాయతీ గ్రామంలో బుధవారం నాడు ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామ కార్యదర్శి భరద్వాజ్ తో కలిసి ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలకు మార్కౌట్ చేసి నిర్మాణ పనులను బుధవారం నాడు ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ  జుక్కల్ మండలంలోని గ్రామాలలో ఇందిరమ్మ గృహ పథకాల లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను నిర్మించుకునేందుకు పనులను ముమురం చేశారని అన్నారు.

నిత్యం గ్రామాలను సందర్శించి నిర్మాణ పనులను పరిశీలిస్తున్నామని తెలిపారు. పనులలో వేగవంతం పెంచేందుకు నిత్యం లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రతి లబ్ధిదారులు మంజురైన ఇండ్లను కచ్చితంగా ప్రాణులను ప్రారంభించాలని వారికి మూడు విడుదలుగా బిల్లులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గ్రామ జిపి కార్యాలయాన్ని సందర్శించి జిపి రికార్డులను సందర్శించారు. రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కార్యదర్శి కి ఆదేశించారు. గ్రామంలో చెత్తాచెదారం పేరుకుపోకుండా నిత్యము గ్రామాభివృద్ధిలో తమ వంతుగా కృషి చేయాలని ఉద్యోగ బాధ్యతగా నిర్వర్తించాలని జిపి కార్యదర్శి కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు జిపి కార్యదర్శి , జిపి కార్యవర్గ సభ్యులు,  గ్రామ పెద్దలు,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -