Wednesday, February 4, 2026
E-PAPER
HomeNewsఅంగన్వాడి పిల్లలకు పౌష్టికాహారం నిత్యం అందించాలి

అంగన్వాడి పిల్లలకు పౌష్టికాహారం నిత్యం అందించాలి

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని సావర్గావ్ గ్రామం, సావర్గావ్ తండా గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో ఆయా కేంద్రాల టీచర్ల ఆధ్వర్యంలో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారాలను గ్రామ సర్పంచ్ కపిల్,  ఉపసర్పంచ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ సుధాకర్ మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాలలో బాలింతలు, గర్భవతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో లబ్ధిదారులకు అందుతున్న సేవలను అడిగి అంగన్వాడీ టీచర్లను ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాలకు హాజరైన పిల్లలతో సరదాగా మాట్లాడుతూ.. వారిచే ఆటపాటలు ఆడించారు. అనంతరం పిల్లలకు గుడ్లు, పాలు , పౌష్టికాహారం అందించారు. అంగన్వాడి టీచర్లతో పిల్లల ఎత్తు, బరులను పరిశీలించారు. కేంద్రాలలో పిల్లల సంఖ్యను పెంచాలని నిత్యము గ్రామాలలోని పిల్లలను కేంద్రాలకు వచ్చే విధంగా పిల్లల తల్లిదండ్రులకు అవగాహన చేయాలని  సూచించారు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో తాండ అంగన్వాడీ టీచర్ బుజ్జి బాయి , గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -