నవతెలంగాణ -ముధోల్
సీఎం కప్ క్రిడా పోటీలు క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ క్రీడా పోటీలు దోహదపడతాయని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ లు అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆవరణలో నియోజకవర్గ స్థాయిలో జరిగే సీఎం క్రీడా పోటీలకు ముఖ్యఅథితి లుగా హాజరై వారు మాట్లాడారు.. గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, ప్రతిభను చాటెందుకు సీఎం క్రీడ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముధోల్ నియోజకవర్గ ములోని ఆయా గ్రామాల క్రీడాకారులు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి విద్యార్థులు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ పోటీలు గురువారం నాటికి ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో లవ కుమార్, ముధోల్ సర్పంచ్ షబానా బేగం, ఉపసర్పంచ్ లావణ్య , బాసర ఎంపీడీవో దేవేందర్ రెడ్డి ఎంఈఓ రమణారెడ్డి, ఎంపీ ఓ చంద్ర శేఖర్, పిడి శ్రీనివాస్ సూపరిండెంట్ అశోక్ తో పాటు నియోజక వర్గంలోని ఆయా మండలాలకు సంబంధించినటు వంటి పీడీలు, పీఈటీలు వివిధ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు, తదితరులు, పాల్గొన్నారు.
ప్రతిభని వెలికి తీసేందుకే క్రీడా పోటీలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



