నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. గురువారం ఉదయం 11 గంటలకు తిరిగి ఉభయసభలు ప్రారంభంకానున్నాయి. ఇవాళ సభ ప్రారంభం నుంచే ప్రతిపక్షాలు ఆందోళన బాటపట్టాయి. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సీపీఐ(ఎం) ఎంపీ తోపాటు కాంగ్రెస్ కు చెందిన ఏడుగురు ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఖండించాయి. దీంతో తొలుత సభను 12గంటలకు వాయిదా వేశారు. మళ్లీ మధ్యాహ్నాం 2గంటలకు సభను స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. మరలా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. మాజీ ఆర్మీ చీప్ జనరల్ నరవాణీ రాసిన బుక్‌లోని అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్ పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేయగా పియూల్ ఆ డీల్ పై క్లుప్తంగా వివరించారు. ఇండియా వస్తువులపై యూఎస్ టారిప్‌లు తగ్గించిందని, దీంతో ఇండియాకు ఊరట లభించిందని చెప్పారు. ఇరుదేశాల మధ్య తలెత్తిన దాత్యపర్య వివాదాలకు తెరపడిందని చెప్పారు.
రేపటికి పార్లమెంట్ సమావేశాలు వాయిదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



