Wednesday, February 4, 2026
E-PAPER
Homeబీజినెస్ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలోనూ క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రధాన కార ణాలలో ఒకటిగా ఉంది; అయినప్పటికీ ఇది చాలా తప్పుగా అర్థం చేసుకున్న క్యాన్సర్లలో ఒకటి. ధూమ పానం చేసే వారిని మాత్రమే ప్రభావితం చేసేదిగా, ఆలస్యంగా నిర్ధారణ చేయబడేదిగా, చికిత్స ఎంపికలను పరిమితంగా కలిగి ఉన్న వ్యాధిగా ప్రజల అభిప్రాయం చాలా కాలంగా దీనిని చిత్రీకరించింది. నేడు, సైన్స్ దీనికి చాలా భిన్నమైన కథను చెబుతోంది.

ముఖ్యంగా భారతీయ నగరాల్లో, వైద్యులు మారుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ స్థితిగతులను చూస్తున్నారు – ఇది పొగాకు వాడకం ద్వారా మాత్రమే కాకుండా, వాయు కాలుష్యం, భవనాల్లోని గాలి నాణ్యత, సెకండ్ హ్యాండ్ పొగ,  వివిధ అంశాలకు వృత్తిపరంగా లోను కావడం ద్వారా కూడా ప్రభావితమవుతుంది. అదే సమ యంలో, రోగ నిర్ధారణ, చికిత్సలో పురోగతి చోటు చేసుకుంటోంది. అంటే, చికిత్స ఫలితాలు చాలామంది నమ్ముతున్నంత విచారకరంగా ఏమీ ఉండవు – ముఖ్యంగా వ్యాధిని ముందుగానే గుర్తించినప్పుడు.

హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లోని ఆంకాలజీ సర్వీసెస్ డైరెక్టర్, మెడికల్ & హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ జివికె రెడ్డి మాట్లాడుతూ, ‘‘మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నిర్ధా రించడమే కాదు, దాని చుట్టూ ఉన్న అపోహలను సరిదిద్దడం” అని అన్నారు. ‘‘ఊపిరితిత్తుల క్యాన్సర్ ధూమపానం చేసేవారిని మాత్రమే ప్రభావితం చేస్తుందని, ఆ లక్షణాలను విస్మరించవచ్చని లేదా చికిత్సా ఎంపికలు తక్కువగా ఉన్నాయని చాలా మంది ఇప్పటికీ నమ్ముతారు. వాస్తవానికి, నేడు మేం ధూమపానం చేయని వారిలోనే  ఎక్కువగా ఈ వ్యాధిని నిర్ధారి స్తున్నాం, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో. ఒక దశాబ్దం క్రితం కంటే ఇప్పుడు మన వద్ద చాలా ఎక్కువ చికిత్స సాధనాలు ఉన్నాయి. లక్షణాల ప్రారంభ మూల్యాంకనం,   సకాలంలో రోగ నిర్ధారణ అనేవి రోగుల మనుగడ, జీవన నాణ్యత రెండింటినీ గణనీయంగా మెరుగుపరు స్తాయి’’ అని అన్నారు.

దీనిని మరింత బాగా అర్థం చేసుకోవడానికి, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించి ఉన్న కొన్ని సాధారణ అపోహలు, వాటి వెనుక ఉన్న నిజాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
అపోహ 1: ధూమపానం చేసేవారికి మాత్రమే ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది
ధూమపానం ఒక అతిపెద్ద ప్రమాద కారకంగా ఉన్నప్పటికీ, ధూమపానం చేయని వారిలోనూ, ముఖ్యంగా పట్టణ వాతా వరణాలలో కాలుష్యం పెరిగిన వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా నిర్ధారణ అవుతోంది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ బహిరంగ వాయు కాలుష్యాన్ని క్యాన్సర్ కారకంగా వర్గీకరి స్తుంది. ఆసియాలో, మహిళల్లో దాదాపు 60–80 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ఎప్పుడూ ధూమ పానం చేయని వారిలో సంభవిస్తాయని పరిశోధనలు చూపిస్తున్నాయి. ఈ ధోరణిని ప్రతిబింబిస్తూ, భారతీయ మహానగరాల్లోని వైద్యులు పొగాకు వాడకం అలవాటు లేని మహిళలు, యువకులలో ఊపిరితిత్తుల క్యా న్సర్ నిర్ధారణ పెరుగుదలను నివేదిస్తున్నారు – ఇది కలుషితమైన గాలి, పార్టిక్యులేట్ మ్యాటర్, సెకండ్ హ్యాండ్ స్మోక్, ఇంటి లోపలి కాలుష్య కారకాలకు దీర్ఘకాలికంగా గురికావడం యొక్క పెరుగుతున్న పాత్రను నొక్కి చెబుతుంది.

అపోహ 2: ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఎల్లప్పుడూ పేలవమైన మనుగడ రేటు లేదా మరణం అని అర్థం
రోగ నిర్ధారణ దశ, కణితి రకం, మాలిక్యూలర్ ప్రొఫైల్‌ను బట్టి ఫలితాలు విస్తృతంగా మారుతూ ఉంటాయి. ఇమేజింగ్, పాథాలజీ, పరమాణు పరీక్షలలో పురోగతి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంరక్షణను మార్చివేసింది. నేడు, చికిత్స రోగి ప్రొఫైల్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించబడుతోంది. చాలా మంది రోగులు గతంలో సాధ్యమైన దానికంటే ఎక్కువ కాలం, మెరుగ్గా జీవిస్తున్నారు.

అపోహ 3: నిరంతర దగ్గు మాత్రమే ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క ఏకైక లక్షణం
దీర్ఘకాలిక దగ్గు అనేది ఒక సాధారణ హెచ్చరిక సంకేతం అయినప్పటికీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు చాలా వైవిధ్యంగా, సూక్ష్మంగా ఉంటాయి, ముఖ్యంగా ప్రారంభ దశల్లో. శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, వివరించలేని అలసట, గొంతు బొంగురుపోవడం, బరువు తగ్గడం లేదా పదేపదే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు అన్నీ ఈ సమస్యను సూచిస్తాయి. కాలుష్య నగరాల్లో, ఈ లక్షణాలను తరచుగా సాధారణమైనవిగా తోసిపుచ్చు తారు. దాంతో రోగ నిర్ధారణను ఆలస్యం చేస్తారు. సత్వరమే గుర్తించడం అనేది చికిత్స ఎంపికలను గణనీయం గా విస్తృతం చేస్తుంది,  ఫలితాలను మెరుగుపరుస్తుంది కాబట్టి, లక్షణాలు కొనసాగితే లేదా తీవ్రమైతే వైద్య మూల్యాంకనం కోసం వైద్యులు సలహా ఇస్తారు.

అపోహ 4: ఊపిరితిత్తుల క్యాన్సర్లన్నీ ఒకే రకంగా ఉంటాయి
ఊపిరితిత్తుల క్యాన్సర్‌లో అనేక ఉప రకాలతో సహా స్మాల్ సెల్,  నాన్- స్మాల్ సెల్ అనే రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. నేడు చికిత్స ట్యూమర్ బయోలజీపై ఆధారపడి ఉంది. ఇది బయోమార్కర్, మాలిక్యులర్ పరీక్ష ను తప్పనిసరి చేస్తుంది. ఈ తేడాలను గుర్తించడం అనేది వైద్యులు టార్గెటెడ్ అడ్వాన్స్డ్ చికిత్సలు, ఇమ్యునో థెరపీతో సహా చికిత్సను అనుకూలీకరించడానికి వీలు కల్పిస్తుంది. ఇది ప్రారంభంలోనే నిర్ధారణ అయినప్పు డు మెరుగైన ఫలితాలకు దారితీస్తుంది.
అపోహ 5: ఊపిరితిత్తుల క్యాన్సర్ వృద్ధులను మాత్రమే ప్రభావితం చేస్తుంది
వృద్ధులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ, భారతీయ నగరాల్లోని వైద్యులు ధూమ పానం చేయని వారితో సహా మహిళలు, యువకులలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ఎక్కువగా గమనిస్తున్నా రు. వాయు కాలుష్యం, పాసివ్ ధూమపానం మొదలైన ఇతర అంశాలకు గురికావడం రిస్క్ ప్రొఫైల్‌ను విస్తృ తం చేసింది. వయస్సు లేదా లింగంతో సంబంధం లేకుండా అప్రమత్తతను ముఖ్యమైనదిగా చేసింది. లక్షణాల ముందస్తు మూల్యాంకనం అనేది విస్తృత శ్రేణి చికిత్సా ఎంపికలను పొందటానికి వీలు కల్పిస్తుంది, ఫలితాల ను మెరుగుపరుస్తుంది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇకపై ఒక అలవాటు లేదా దేనికైనా గురి కావడం ద్వారా నిర్వచించబడిన వ్యాధి కాదు. భారతదేశ నగరాల్లో, ఇది చుట్టుపక్కల పరిస్థితులకు గురి కావడం, జీవనశైలి కారణంగా చోటు చేసు కుంటోంది. ఈ లక్షణాలను ఎంత త్వరగా గుర్తిస్తున్నారు, ఎంత తీవ్రంగా తీసుకుంటారనేది ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి. సకాలంలో రోగ నిర్ధారణ, సమాచారంతో కూడిన చికిత్స నిర్ణయాలను ప్రోత్స హించడానికి అపోహలను ఛేదించడం చాలా అవసరం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -