- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆంధ్ర యూనివర్సిటీలో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం రేపింది. ఏయూలో బాంబు పెట్టినట్లు అపరిచిత వ్యక్తుల నుంచి ఈమెయిల్ రావడంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే త్రీటౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ కార్యాలయంతో పాటు యూనివర్సిటీ ప్రాంగణమంతా క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు. విద్యార్థులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సీఐ పైడయ్య తెలిపారు.
- Advertisement -



