నవతెలంగాణ-హైదరాబాద్: ఎప్‌స్టీన్ సెక్స్ స్కామ్ కారణంగా తన భర్త బిల్ గేట్స్‌కు విడాకలు ఇచ్చానని ఆయన మాజీ భార్య మిలిందా యూఎస్ నేషనల్ పబ్లిక్ రేడియోకు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఆస్ట్రేలియా మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో బిల్ గేట్స్ స్పందించారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో గడిపిన సమయంపై విచారం వ్యక్తం చేశారు. ‘‘నేను చింతిస్తు్న్నాను. క్షమించండి.’’ అని బిల్‌గేట్స్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. 2011లో ఎప్‌స్టీన్‌ను కలిశానని.. మూడేళ్ల పాటు అతనితో అనేక విందుల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ‘‘నేను అతనితో గడిపిన ప్రతి నిమిషం నేను చింతిస్తున్నాను. క్షమాపణలు కోరుతున్నాను.’’ అని 9 న్యూస్ ఆస్ట్రేలియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ విచారం వ్యక్తం చేశారు. ‘‘ఆ ఈ-మెయిల్ ఎప్పుడూ పంపలేదు. ఆ ఈ-మెయిల్ తప్పు.’’ అని తోసిపుచ్చారు. ‘‘అతని ఆలోచన ఏమిటో నాకు తెలియదు. అతను ఏదో విధంగా నాపై దాడి చేయడానికి ప్రయత్నించాడు?.’’ అని అనిపిస్తోందన్నారు.
ఎప్‌స్టీన్ సెక్స్ స్కామ్‌పై బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



