నవతెలంగాణ-హైదరాబాద్: దేశవ్యాప్తంగా యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్ పై హాట్ టాపిక్ నడుస్తోంది. అమెరికాతో భారత్ చేసుకున్న ఒప్పందంపై స్పష్టత కావాలని, పార్లమెంట్ లో సదరు ఒప్పందంపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కారణంతో పలుమార్లు లోక్ సభ కూడా వాయిదా పడుతుంది. తాజాగా ఈ అంశంపై కేంద్ర మంత్రి పియూష్ గోయాల్ కీలక ప్రకటన చేశారు. యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్ పై ఇరుదేశాల నుంచి సంయుక్త ప్రకటన వెలువడుతుందని వెల్లడించారు. వచ్చే నాలుగు రోజుల్లో సదురు ఒప్పందంపై క్లారీటీ వస్తోందని చెప్పారు. వచ్చే మార్చిలో యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్ ఒప్పందంపై సంతకాలు చేయనున్నారని పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా భారత్ పై 18 శాతం టారిప్‌లు తగ్గించిందన్నారు. ఒప్పందంపై విధానపరమైన అంశాలపై, రెండు దేశాల సుంకాల నిర్మాణాల మధ్య వ్యత్యాసాన్ని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వివరిస్తున్నారని తెలియజేశారు.
నాలుగు రోజుల్లో యూఎస్ ట్రేడ్ డీల్‌పై క్లారిటీ: పియూష్ గోయాల్
- Advertisement -
- Advertisement -



