Thursday, February 5, 2026
E-PAPER
Homeజిల్లాలుఇంటర్మీడియట్ బోర్డు ఎదుట‌ ఎస్ఎఫ్ఐ ధర్నా

ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట‌ ఎస్ఎఫ్ఐ ధర్నా

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: హైద‌రాబాద్‌లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాల‌యం ఎదుట ఉద్రిక‌త్త నెల‌కొంది. ఇంట‌ర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీకి పాల్ప‌డ్డాన‌ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండించింది. అందుకు నిర‌స‌నంగా ఇంటర్మీడియట్ బోర్డు ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేప‌ట్టారు. మాస్ కాపికీ పాల్ప‌డిన స‌దురు కాలేజీల గుర్తింపును ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. అనంతరం ఇంటర్మీడియట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రదకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో SFI రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.మమత, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె. అశోక్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కార్యదర్శి కార్తీక్. రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్,అవినాష్, జె.రమేష్, SFI నాయకులు నాగేందర్, ప్రశాంత్,ప్రవీణ్,ఆంజనేయులు,సాయి,నీరజ్,యశ్వంత్,కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

SFI-led dharna in front of the Intermediate Board
SFI-led dharna in front of the Intermediate Board
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -