- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు, లోహరంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 500 పాయింట్లు నష్టపోయి, 83,313 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132 పాయింట్లు కుంగి, 25,642 వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 83,757 వద్ద (క్రితం ముగింపు 83,817 ) ప్రారంభమైంది. ఒక దశలో 83,784 వద్ద గరిష్ఠాన్ని తాకింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.33గా ఉంది.
- Advertisement -



