Friday, February 6, 2026
E-PAPER
Homeఆటలుఅండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్‌: వైభ‌వ్ సూర్య‌వంశీ సెంచరీ

అండ‌ర్-19 వ‌ర‌ల్డ్ క‌ప్‌: వైభ‌వ్ సూర్య‌వంశీ సెంచరీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: జింబాబ్వే వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో వైభ‌వ్ సూర్య‌వంశీ సెంచరీతో క‌దంతొక్కాడు. 55 బంతుల్లో 100 ప‌రుగులు పూర్తి చేశాడు. 8ఫోర్లు,8 సిక్స్‌ల‌తో ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను ఆటాడుకున్నాడు. ప్ర‌తి ఓవ‌ర్‌ల్లో ఫోర్లు, సిక్స‌ల‌ర్లు బాదుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. మొద‌ట టాస్ గెలిచిన‌ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో లైన్ అండ్ లెన్త్ బౌల్స్ తో భార‌త్ బ్యాట‌ర్ల‌ను ఇంగ్లాండ్ బౌల‌ర్లు నిల‌వ‌రించే ప్ర‌య‌త్నాం చేశారు. ఆ త‌ర్వాత క్రీజులో కుదురుకున్న వైభ‌వ్ సూర్య‌వంశీ .. స్టేడియం న‌లువైపుల షాట్ ల‌తో దుమ్మురేపాడు. ప్ర‌తి బంతిని బౌండ‌రీకి త‌ర‌లిస్తూ బౌల‌ర్ల‌పై ఆధిప‌త్యం చెలాయించాడు. కెప్టెన్ ఆశిష్ మాత్రే అర్ధ సెంచ‌రీతో అమూల్య‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. సెమీ ఫైన‌ల్‌లో సెంచ‌రీతో చెల‌రేగిన అరోన్ జార్జీ 9 ప‌రుగుల‌కే ఔట్ అయ్యాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -