Friday, February 6, 2026
E-PAPER
Homeజాతీయంఫిబ్ర‌వ‌రి 9కి పార్ల‌మెంట్ వాయిదా

ఫిబ్ర‌వ‌రి 9కి పార్ల‌మెంట్ వాయిదా

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పార్ల‌మెంట్‌లో యూఎస్ ట్రేడ్ డీల్, మాజీ ఆర్మీ చీప్ జ‌న‌ర‌ల్ న‌ర‌వాణే రాసిన త్రీ ఫోర‌స్ డెస్టినీ బుక్ ల‌పై చ‌ర్చ పెట్టాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్నా విష‌యం తెలిసిందే. తాజాగా శుక్ర‌వారం కూడా విప‌క్షాలు ఆందోళ‌న‌లు కొన‌సాగించ‌డంతో ఫిబ్ర‌వ‌రి 9కి ఉభ‌య‌స‌భ‌ల‌ను స్పీక‌ర్ వాయిదా వేశారు. స‌భ ఉద‌యం ప్రారంభంగానే యూఎస్ ట్రేడ్ డీల్, న‌వ‌వాణే బుక్ ల‌పై చ‌ర్చ‌పెట్టాల‌ని మ‌ర‌ల విప‌క్ష ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ ట్రంప్ డీల్ కాదు..ట్రాప్ డీల్ అంటూ ప్లకార్డులు ప్ర‌ద‌ర్శించారు. దీంతో స్పీక‌ర్ స‌భ‌ను 12గంట‌ల‌కు వాయిదా వేశారు. స‌భ పున‌ర్ ప్రారంభం కాగానే మ‌రోసారి ప్ర‌తిప‌క్షాల ఎంపీలు త‌మ ఆందోళ‌ల‌ను ఉధృతం చేశారు. దీంతో స్పీక‌ర్ ఫిబ్ర‌వ‌రి 9కి స‌భ‌ను వాయిదా వేశారు.

కాగా ఆదివారం కేంద్ర ఆర్థిక నిర్మ‌లా సీతారామ‌న్ వార్షిక బడ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్ట‌గా.. సోమ‌వారం యూఎస్ ట్రేడ్ డీల్,న‌ర‌వాణే బుక్ త‌దిత‌ర‌ అంశాల‌పై ఉభ‌య‌స‌భ‌ల్లో చ‌ర్చ పెట్టాల‌ని ప్ర‌తిప‌క్షాలు నినాదాల‌తో హోరెత్తిస్తున్నాయి. పీఎం మోడీ యూఎస్‌తో రాజీ ప‌డ్డార‌ని ఎద్దేవా చేస్తూ స్పీక‌ర్ పోడియం ముందు ఆందోళ‌న చేపట్టారు. ప్ర‌తిప‌క్షాల తీరును ఖండిస్తూ స్పీక‌ర్ ఓం బిర్లా సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన 8మంది ఎంపీల‌పై వేటు వేశారు. స్పీక‌ర్ నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ విప‌క్షాలు పార్ల మెంట్ ప్రాంగ‌ణంలో నిర‌స‌న చేప‌ట్టారు. రాష్ట్రప‌తి ప్ర‌సంగంపై ధ‌న్య‌వాదాలు తీర్మానంపై పీఎం మోడీ లోక్ స‌భ‌లో కాకుండా రాజ్య‌స‌భ‌లో మాట్లాడారు. పీఎం నిర్ణయ‌న్ని నిర‌సిస్తూ పెద్ద‌ల‌స‌భ‌లో విప‌క్షాల వాకౌట్ చేసిన విష‌యం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -