నవతెలంగాణ-హైదరాబాద్: జింబాబ్వే వేదికగా జరిగిన అండర్-19వరల్డ్ కప్ ఫైనల్ బరిలో యువభారత్ భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లగాను 9 వికెట్లు కోల్పోయి 411 పరుగుల కొండాంత లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది. వైభవ్ సూర్యవంశీ సెంచరీ(175-15ఫోర్లు,15 సిక్స్)తో కదంతొక్కాడు. కెప్టన్ అర్ధసెంచరీతో అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెమీ ఫైనల్లో సెంచరీతో చెలరేగిన అరోన్ జార్జీ 9 పరుగులకే ఔట్ అయ్యాడు.
మొదట టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలో లైన్ అండ్ లెన్త్ బౌల్స్ తో భారత్ బ్యాటర్లను ఇంగ్లాండ్ బౌలర్లు నిలవరించే ప్రయత్నాం చేశారు. ఆ తర్వాత క్రీజులో కుదురుకున్న వైభవ్ సూర్యవంశీ .. స్టేడియం నలువైపుల షాట్ లతో దుమ్మురేపాడు. ప్రతి బంతిని బౌండరీకి తరలిస్తూ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. వైభవ్ క్రీజులో ఉన్నంత సేపు పరుగుల వరద పారింది.
55 బంతుల్లో 100 పూర్తి చేసిన వైభవ్..కేవలం 17 బంతుల్లోనే 50 రన్స్ చేసి 150 మార్కును ఆందుకున్నాడు. సెంచరీ తర్వాత తన బ్యాట్‌కు మరింత పదును పెట్టి ఇంగ్లాండ్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ప్రతి బౌలింగ్‌లో ఫోర్లు, సిక్స్‌లతో స్టేడియం నలుమూలాల వినూత్న షాట్లతో ఆలరించాడు. వైభవ్ భీకర్ ఆట తీరుతో ఇంగ్లాండ్ కెప్టన్‌ను హడల్ ఎత్తించాడు. ఎవరికి బౌలింగ్ ఇచ్చినా.. ఆకాశమే హద్దుగా ఫోర్లు, సిక్సలతో బాల్‌ను స్టేడియాన్ని దాటించాడు.
లమ్స్‌డెన్ వేసిన 8ఓవర్లో 15, మింటో వేసిన 9 ఓవర్లో 18, ఆమేద్ వేసిన 15ఓవర్లో 15, ఆమేద్ వేసిన 17ఓవర్లో 3సిక్సలు ఓ ఫోర్‌తో 22 పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గ్రీన్ వేసిన 21ఓవర్లో 19, ఆల్ బర్ట్ వేసిన 22ఓవర్లో 27, మోర్గాన్ వేసిన 25 ఓవర్లో25 రన్స్‌ను పిండుకున్నాడు. దీంతో వైభవ్ భీకర్ షాట్లతో ఇంగ్లాండ్ బౌలర్లు బెంబెలెత్తిపోయారు. ఎవరికి బౌలింగ్ ఇచ్చినా..సిక్స్ లు, ఫోర్లలతో వీరబాదుడు బాదుతున్న వైభవ్ ఆటను తీరు చూసి ఇంగ్లాండ్ కెప్టన్ అయోమయంలో పడిపోయాడు. పలు మార్లు బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. దీంతో మోర్గాన్ వేసిన 25 ఓవర్లో పరుగుల సునామీ వైభవ్ భారీ షాట్ ఆడబోయి కీపర్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లాండ్ బౌలర్లకు భారీ ఉపశమనం లభించింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇతర బ్యాటర్లు మలోత్రా 30,కుందా 40, కై చౌహన్ 37 రన్స్ లతో భారీ లక్ష్యాన్ని(411) ఇంగ్లాండ్ ముందు ఉంచారు.
ఇంగ్లాండ్ బౌలర్లు మింటో 3, మోర్గాన్, గ్రీన్ రెండు వికెట్లు,లమ్స్‌డెన్ ఒక వికెట్ తీశారు



