Friday, February 6, 2026
E-PAPER
Homeబీజినెస్రవాణా విభాగంతో మారుతి సుజుకీ  మొమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ పై సంతకం

రవాణా విభాగంతో మారుతి సుజుకీ  మొమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ పై సంతకం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : మారుతి సుజుకీ  వారి CSR కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 4 ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ (“ADTTలు  ”) ఏర్పాటు మరియు నిర్వహణ కోసం  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి రవాణా విభాగంతో  మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ ( “Maruti Suzuki”) ఒక అంగీకార ఒప్పందంపై  (“MoA”) సంతకం చేసింది.

ADTTలు రాష్ట్రంలో ఏలూరు, ఒంగోలు, విజయనగరం, మరియు అనకాపల్లి వంటి నాలుగు  రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ (RTO) ప్రదేశాల్లో ADTTలు ఏర్పాటు చేయబడతాయి. MoA ద్వారా, మారుతి సుజుకీ ఈ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ ను ప్రారంభించిన తేదీ నుండి  3 సంవత్సరాల సమయం వరకు  ఆటోమేట్ చేస్తాయి మరియు నిర్వహిస్తాయి.

image.jpeg

ADTTలు హై-డెఫినిషన్ కెమెరాలు, RFID   సెన్సర్లు, రియల్  టైమ్ అనలిటిక్స్ మరియు సమగ్ర  IT వ్యవస్థతో సన్నద్ధం చేయబడతాయి. దీని ద్వారా సాంకేతికత ఆధారిత, ప్రమాణీకృతమైన మరియు నిష్పాక్షికమైన డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షా ప్రక్రియను అమలు చేయడం సాధ్యమవుతుంది. మానవ జోక్యం లేకుండా (జీరో హ్యూమన్ ఇంటర్వెన్షన్) ADTTలు లైసెన్స్  పరీక్షలను మరింత సమగ్రంగా, సమర్థవంతంగా మరియు పారదర్శకంగా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ కఠినమైన మరియు ప్రమాణీకృత మూల్యాంకన విధానం కేంద్ర మోటారు వాహన నియమాలు (CMVR) ప్రకారం అభ్యర్థులను అంచనా వేయడానికి రూపకల్పన చేయబడింది. పరీక్ష ఫలితాలు కూడా స్వయంచాలకంగా రూపొందించబడతాయి.

ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ, శ్రీ. హిసాషి తకేవుచి, MD & CEO, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ ఇలా అన్నారు,   గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, శ్రీ చంద్రబాబు నాయుడు గారితో  జరిగిన సమావేశంలో ఆయనకు టెక్నాలజీ పట్ల ఉన్న అభిమానం ఎంతో ఆకట్టుకుంది. టెక్నాలజీ ఆధ్వర్యంలో పరిష్కారాల కోసం  వారికి ఉన్న  దూరదృష్టికి అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము 4 ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ ( ADTT)తీసుకురావడం మాకు గర్వ కారణంగా నిలిచింది. మనుష్యుల జోక్యం లేకుండా ఒక సమగ్రమైన, సమర్థవంతమైన మరియు నిజాయితీ ప్రక్రియను నిర్థారించడానికి ADTTలు  ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తారు.  ఇది కేవలం నైపుణ్యవంతులైన డ్రైవర్లకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ లు జారీ  చేయడానికి హామీ ఇస్తుంది తద్వారా  మొత్తం రోడ్డు భద్రత మెరుగవుతుంది.

MoA పై సంతకం చేసే సమయంలో మాట్లాడుతూ, శ్రీ. మనీష్ కుమార్ సిన్హా IPS, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ  కమిషనర్ ఇలా అన్నారు, రాష్ట్రంలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ ( ADTTలు) ద్వారా రోడ్డు భద్రతకు గణనీయమైన తోడ్పాటును అందించిన భారతదేశపు ప్రముఖ ప్యాసింజర్ వెహికిల్ తయారీదారు మారుతి సుజుకీని నేను అభినందిస్తున్నాను. ఈ ప్రాజెక్టులో, మారుతి సుజుకీ  SARATHI** సిస్టంతో  అనుసంధానం, సిబ్బందికి శిక్షణ మరియు సాధారణ నిర్వహణ వంటి రంగాలలో టెక్నాలజీ సహాయాన్ని 3 సంవత్సరాల పాటు అందించి సహాయం చేస్తుంది. ఇప్పటికే ఉన్న డ్రైవింగ్ ట్రాక్స్ లో కావలసిన మౌళిక సదుపాయాన్ని రవాణా విభాగం కేటాయిస్తుంది, పౌర సేవలు చేపడుతుంది, భద్రత మరియు విద్యుత్తు సరఫరాను నిర్థారిస్తుంది మరియు ఆటోమేటెడ్ వ్యవస్థను ఉపయోగించి  డ్రైవింగ్ పరీక్షలు మరియు డ్రైవింగ్ లైసెన్స్ ల జారీని నిర్థారిస్తుంది.

ఆయన ఇంకా ఇలా అన్నారు, “డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్స్ యొక్క  ఆటోమేషన్  పరీక్షా ప్రక్రియలో గొప్ప ఏకరీతిని మరియు  నిష్పక్షపాతతను తీసుకువస్తుంది మరియు కావలసిన డ్రైవింగ్ నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ ను జారీ చేయబడటం నిర్థారిస్తుంది, తద్వారా రాష్ట్రంలో రోడ్డు భద్రత శక్తివంతం చేయబడుతుంది.

ఏలూరు, విజయనగరం, ఒంగోలు మరియు అనకాపల్లిలోని ADTTలు లైట్ మోటార్ వెహికిల్స్ (LMV) మరియు టూ-వీలర్స్ (TW) డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు తోడ్పడుతుంది. ఒంగోలులోని ADTT హెవీ మోటార్ వెహికిల్స్ (HMV) డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అదనంగా సహాయపడుతుంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -