Friday, February 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్‌లో మ‌రోసారి ఉద్రిక్త‌త

బంగ్లాదేశ్‌లో మ‌రోసారి ఉద్రిక్త‌త

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: బంగ్లాదేశ్‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా..మ‌రోసారి ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆ దేశ మ‌ధ్యంత‌ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడు యూనిస్ ఖాన్ ఇంటి వ‌ద్ద‌కు ఇంక్విలాబ్ మోర్చా కార్యక‌ర్తలు దండెత్తి వ‌చ్చారు. ఉస్మాన్ హాదీ హ‌త్య‌కు కార‌ణ‌మైన వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసి, త‌గిన న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. ఆయ‌న ఇంటిలోకి చోచ్చుకెళ్లేందుకు ఆందోళ‌న‌కారులు య‌త్నించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు భారీ యోత్తున మోహ‌రించి, బారికేడ్ల‌ను ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపు చేయ‌డానికి ముందుగానే వాట‌ర్ ఫిరంగుల‌ను, టియ‌ర్ గ్యాస్‌ల‌ను ఆందోళ‌న‌కారుల‌పై ప్ర‌యోగించ‌డానికి సంసిద్ధం చేశారు.

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 12న దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈక్ర‌మంలోనే ఈ త‌ర‌హా ఆందోళ‌న‌లు త‌లెత్త‌డంతో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై సందేహాలు నెల‌కొన్నాయి. గ‌తేడాది డిసెంబ‌ర్ 12 గుర్తుతెలియని దుండ‌గ‌లు ఉస్మాన్ హాదీపై కాల్పులు జ‌ర‌ప‌గా స్పాట్‌లోనే మృతి చెందిన విష‌యం తెలిసిందే. హాదీ హ‌త్య‌తో ఆ దేశంలో తీవ్ర‌మైన అల్ల‌ర్లు చెల‌రేగి..హింస‌కు దారితీసింది. అల్ల‌రిమూక‌లు మైనార్టీలైనా హిందువుల‌పై దారుణంగా దాడులు చేసి చంపేశారు. ఈ సంఘ‌ట‌న‌ల‌పై భార‌త్ ప్ర‌భుత్వం తీవ్రంగా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. మైనార్టీలైనా హిందువుల ప్రాణాల‌కు త‌గిన రక్ష‌ణ క‌ల్పించాల‌ని డిమాండ్ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -