- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పురపాలిక ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళా అభ్యర్థులు ఒకే వార్డు నుంచి పోటీ పడుతున్నారు. వీరి భర్తలు వరసకు అన్నదమ్ములు అవుతారు. రెండో వార్డు నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ తరఫున బీసోళ్ల సంధ్యారాణి అనే ఇద్దరు అభ్యర్థులు బరిలోకి దిగారు. ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉన్నందున, పార్టీ గుర్తును చూసి ఓటు వేయాలని అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. వీరిద్దరూ చాలా ఏండ్లుగా శంకర్పల్లి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు.
- Advertisement -



