- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా శనివారం రాత్రి భారత్, యూఎస్‌ఏల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే టీమ్‌ఇండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వైరల్ ఫీవర్ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం వాంఖడే స్టేడియంలో టీమ్‌ఇండియా ట్రైనింగ్ సెషన్‌కు కూడా అతడు హాజరుకాలేదని సమాచారం. భారత జట్టు ప్రస్తుతం ఫిట్‌గా ఉన్న 13 మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగనుంది. వాషింగ్టన్ సుందర్ ఇప్పటికీ జట్టుతో చేరలేదు. అతడు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం బుమ్రా గైర్హాజరీలో ఉంటే సిరాజ్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.
- Advertisement -



