- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌తో కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి నెదర్లాండ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. స్కాట్ ఎడ్వర్డ్స్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బాస్ డీ లీడే (30), మైఖేల్ లెవిట్ (24), కోలిన్ అకెర్మాన్ (20) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 3, మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, సయీమ్ అయూబ్ తలో రెండు, షాహీన్ అఫ్రిది 1 వికెట్ తీసుకున్నారు.
- Advertisement -



