నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల ముంబాయి కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. బీజేపీ-శివసేన అధిక స్థానాల్లో గెలుపొందాయి. బీఎంసీ మేయర్ ఎన్నికపై బీజేపీ-శివసేన పోటీబడ్డాయి. ఎట్టకేలకు ఇరు పార్టీలు రాజీ పడి అభ్యర్థి ఎన్నికను ఖరారు చేశాయి. శనివారం బీజేపీ కార్పొరేటర్ల కీలక సమావేశం అనంతరం, మేయర్ అభ్యర్థిగా సీనియర్ నేత రీతూ తావ్డే (Ritu Tawde) పేరును ప్రకటించారు. అదేవిధంగా, డిప్యూటీ మేయర్ పదవికి ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి సంజయ్ శంకర్ ఘాడీ (Sanjay Shankar Ghadi) నామినేషన్ దాఖలు చేశారు.
ముంబై మహానగర కార్పొరేషన్ ఎన్నికలు 227 స్థానాలకు జనవరి 15న ఎన్నికలు జరగ్గా.. ఓట్ల లెక్కింపు జనవరి 16న జరిగింది. ఈ ఓట్ల లెక్కింపులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘రిసార్ట్ పాలిటిక్స్’ మొదలయ్యాయి. ఈ పలితాల్లో బీజేపీ 89 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, దాని మిత్రపక్షం శివసేన (షిండే వర్గం) 29 స్థానాలను దక్కించుకుంది. ఈ కూటమికి మొత్తం 118 స్థానాల మద్దతు ఉండటంతో మేయర్ ఎన్నిక సులభతరమైంది.



