నవతెలంగాణ-హైదరాబాద్: మెగా టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ముంబాయి వేదికగా ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. వాంఖడే స్టేడియంలో యూఎస్ఏ(అమెరికా) టీంతో టీమిండియా తలపడనుంది. గతంలో ముంబయి తరఫున సూర్యకుమార్‌తో కలిసి ఆడిన హర్మీత్‌సింగ్ నేడు అమెరికా కెప్టెన్‌గా భారత్‌కు సవాల్ విసురుతున్నాడు. అమెరికా జట్టులో ముగ్గురు పాకిస్తాన్, ఐదుగురు భారత్‌లో జన్మించిన ఆటగాళ్లు ఉన్నారు. ఫామ్ కోల్పోవటంతో సంజు శాంసన్ బెంచ్‌కు పరిమితం కానుండగా ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా రానున్నాడు. హర్షిత్ రానాకు గాయంతో అర్ష్‌దీప్ సింగ్ తుది జట్టులో నిలువనున్నాడు.
ఈసారి టీ20 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీకి శ్రీలంక-భారత్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. తొలి మ్యాచ్ పాకిస్థాన్, నెదర్లాండ్ మధ్య జరగ్గా..మూడు వికెట్లతో తేడాతో పాక్ తొలి విజయం నమోదు చేసింది. 20 ఓవర్లకు నెదర్లాండ్ 147 కొట్టగా, 7 వికెట్లు నష్టపోయి పాక్ ఆటగాళ్లు టార్గట్ చేధించారు. అదే విధంగా టోర్నిలో రెండో మ్యాచ్ కలకత్తా వేదికగా వెస్టిండిస్, స్కాట్లాండ్ మధ్య జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 185-5 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రస్తుతం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 132 రన్స్ చేసింది.



