Saturday, February 7, 2026
E-PAPER
Homeఆదిలాబాద్మల్లన్న ఆలయంలో అర్ధరాత్రి దొంగతనానికి విఫలయత్నం

మల్లన్న ఆలయంలో అర్ధరాత్రి దొంగతనానికి విఫలయత్నం

- Advertisement -

గడ్డపారతో హుండీలను పగులగొట్టేందుకు యత్నించిన దుండగులు
నవతెలంగాణ – ముధోల్ 

ముధోల్ మండలంలోని ఎడ్‌బిడ్ గ్రామంలో గల  మల్లన్న ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి  గుర్తు తెలియని దొంగలు దొంగతనానికి యత్నం చేశారు.  స్థానికులు కధనం ప్రకారం .. ఈ నెల 4వ  మల్లన్న దేవుని జాతర ముగిసిన విషయం తెలిసిందే.అయితే గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి ఆలయం పక్కనుండి ఆలయం లోపలికి దూరారు.ఆలయం ప్రాంగణంలో ఉన్న హుండీలను  గడ్డపార సహాయంతో  పగలగొట్టేందుకు  దొంగలు ప్రయత్నించారు. ఆలయ పరిసరాల ప్రాంతంలో నిద్రిస్తున్న ఒగ్గు కళాకారులు వారి చప్పుడు విని  కేకలు వేయటంతో దొంగలు పరారయ్యారు.

గ్రామస్తులు వెంటనే సర్పంచ్‌కు సమాచారం ఇవ్వగా, ఆయన పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో  ముధోల్ ఎస్సై  బిట్ల పెర్సెస్ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి శనివారం చేరుకోని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం  క్లూస్ టీమ్స్‌ను రంగంలోకి దింపారు. ఆధారాలు సేకరించి, దుండగులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -