Saturday, February 7, 2026
E-PAPER
Homeబీజినెస్సీగ్రామ్స్ రాయల్ స్టాగ్ బూమ్­బాక్స్ మరలా వచ్చింది

సీగ్రామ్స్ రాయల్ స్టాగ్ బూమ్­బాక్స్ మరలా వచ్చింది

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఒక చారిత్రాత్మక, అనుభవపూర్వకమైన మ్యూజిక్ ఫెస్టివల్ సీగ్రామ్స్ రాయల్ స్టాగ్ బూమ్­బాక్స్, ఎంతో ఎదురు చూస్తున్న సీజన్ ఫోర్­తో మళ్ళీ ముందుకు వచ్చింది. ఇది బాలీఉడ్­కు చెందిన చిరస్మరణీయమైన మెలొడీలను, హిప్-హాప్ లోని ఉర్రూతలూగించే బీట్లతో మేళవిస్తుంది. మునుపటి ఎడిషన్ల అద్భుతమైన విజయాల నేపథ్యంలో ముందడుగు వేస్తూ ఈ సంవత్సరం రాయల్­ స్టాగ్ బూమ్­బాక్స్, అత్యంత ఆశయపూర్వకమైనదిగా రూపొందనున్నది. దీనిలో అత్యంత పేరుప్రఖ్యాతులను పొందిన భారతీయ మరియు అంతర్జాతీయ మ్యూజికల్ టాలెంట్ల అసామాన్యమైన శ్రేణి ఉన్నది. ఈ కళాకారులు నాలుగు అద్భుతమైన యువ హబ్స్ – వైజాగ్, కోల్­కతా, ముంబయ్ మరియు మొహాలీల్లో మల్టీ సిటీ టూర్ చేస్తారు.

రాయల్ స్టాగ్ బూమ్­బాక్స్, నేటి యువతకు అభిరుచి కలిగిన అంశాలను అల్లుకుని సాగే ఉపసాంస్కృతిక అంశాలను, జనరేషన్ లార్జ్-మ్యూజిక్­ను, ఫ్యాషన్­ను, ఫుడ్­ని మరియు గేమింగును మేళవించే ఒక విలక్షణమైన భావాన్ని శ్రోతలకు అందిస్తుందన్న పేరుప్రఖ్యాతులు కలిగినది.

సీజన్ 4 కోల్­కతాలో 21 ఫిబ్రవరి 2026న ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వైజాగ్ (మార్చ్ 7), ముంబయ్ (మార్చ్ 21) మరియు మొహాలీ (మార్చ్ 28) లకు తరలి వెడుతుంది. ప్రారంభించిననాటి నుండి ఈ ఫెస్టివల్, చారిత్రాత్మక బాలీఉడ్ గళాలు మరియు డైనమిక్ హిప్-హాప్ యాక్టుల మధ్య ఉర్రూతలూగించే కొలాబరేషన్ల ద్వారా భారతదేశపు లైవ్ మ్యూజిక్ ముఖచిత్రాన్ని మార్చివేసింది. ఈ సంవత్సరపు శక్తి నిండిన లైనప్­లో అంతర్జాతీయ సంచలన తార అలన్ వాకర్, ర్యాప్ సూపర్­స్టార్ బాద్­షా, చార్ట్-టాపర్స్ అర్మాన్ మలిక్ మరియు డివైన్­లు ఉన్నారు. వారితో పాటు సుస్వరం కలిగిన నీతి మోహన్, నిఖిత గాంధి, రష్మీత్ కౌర్ మరియు శ్రీరామ చంద్ర, లెజెండరీ బ్యాండ్ ఫాజిల్స్ ఉన్నారు. ఈ ఉత్కంఠను మరింతగా పెంచుతూ హిప్-హాప్ ప్రముఖులు రఫ్తార్ మరియు డీనో జేమ్స్, DJ సాహిల్ గులాటీలు కూడా ఉంటారు. సంగీతపరంగా అగ్రస్థానానికి చేరుకున్న హిట్స్, ఇంకా ఉర్రూతలూగించే పెర్ఫార్మెన్సుల అవిస్మరణీయమైన ప్రస్థానాన్ని వీరు తప్పకుండా అందిస్తారు. అంతే కాక, గేమింగ్ సెన్సేషన్ పాయల్ ధరేతో ముఖాముఖీ సందర్భంగా అభిమానులు అందరూ, ఉత్కంఠను కలిగించే గేమింగ్ ఫేస్-ఆఫ్­ను ఆశించవచ్చు. దీనితో ఈ సీజన్ నిజంగా మైమరపింపజేసే సాంస్కృతిక కోలాహలం కాగలదు.

రాయల్ స్టాగ్ బూమ్­బాక్స్, అద్భుతమైన సౌండ్ మరియు మెరుపులను సంభాషించే ఫ్యాన్ జోన్లు మరియు కళకళలాడే కల్చరల్ షోకేసులను మేళవించే సమ్మోహనకరమైన, మల్టీ-సెన్సరీ అనుభవాలకు ప్రఖ్యాతిగాంచింది. ప్రతి ఒక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చే నగరపు విలక్షణమైన స్ఫూర్తిని స్వంతం చేసుకుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -