Sunday, February 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకాల్వలోకి దూసుకెళ్లిన కారు..భార్య మృతదేహం లభ్యం

కాల్వలోకి దూసుకెళ్లిన కారు..భార్య మృతదేహం లభ్యం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : నల్గొండ జిల్లాలో సాగర్‌ ఎడమ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో గాలింపు కొనసాగుతోంది. నిడమానూరు మండలం ముకుందాపురం వద్ద శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో త్రిపురారం మండలం కంపాసాగర్‌కు చెందిన దంపతులు పుల్లయ్య, పద్మ కారులోనే చిక్కుకుపోయి గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం కాల్వ నుంచి కారును క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు. అందులో పద్మ మృతదేహం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పుల్లయ్య ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. శనివారం రాత్రి ఈ ప్రమాదం జరగ్గా.. కారు డ్రైవర్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -