Sunday, February 8, 2026
E-PAPER
Homeనల్లగొండహాలియా మున్సిపాలిటీ ఎన్నికలు చింతల చంద్రారెడ్డికి బ్రహ్మరథం

హాలియా మున్సిపాలిటీ ఎన్నికలు చింతల చంద్రారెడ్డికి బ్రహ్మరథం

- Advertisement -

నవతెలంగాణ-హలియా 
హాలియా మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నెల 11వ తేదీన జరగనున్న ఎన్నికల్లో భాగంగా, ఏడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన చింతల చంద్రారెడ్డి తన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ‘హస్తం’ గుర్తుపై పోటీ చేస్తున్న ఆయన, వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల మద్దతు కోరుతున్నారు.ప్రజా క్షేత్రంలో అఖండ ఆదరణ లభిస్తుంది.గత కొన్ని రోజులుగా వార్డులో విస్తృతంగా పర్యటిస్తున్న చంద్రారెడ్డికి గడపగడపనా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతుండగా, వృద్ధులు ఆయనకు ఆశీస్సులు అందజేస్తున్నారు. వార్డు అభివృద్ధి చింతల చంద్రారెడ్డితోనే సాధ్యమని స్థానికులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.​యువత అండ.. గెలుపే లక్ష్యం గ ఈ ఎన్నికల్లో చంద్రారెడ్డి గెలుపు కోసం వార్డులోని యువత స్వచ్ఛందంగా ముందుకు రావడం విశేషం. వార్డులో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించే సమర్థత ఆయనకు ఉందని యువత బలంగా నమ్ముతోంది. “మా వార్డు భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం చంద్రారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం” అని యువకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.అభివృద్ధి బాటే అజెండా అని ప్రచారంలో భాగంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ..తనపై నమ్మకంతో మద్దతు తెలుపుతున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. వార్డులో మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్య పరిష్కారం మరియు పారిశుద్ధ్య మెరుగుదల తన ప్రథమ ప్రాధాన్యతలని ఆయన హామీ ఇచ్చారు.వార్డు ప్రజలు మరియు యువత చూపుతున్న ఉత్సాహం చూస్తుంటే, 11వ తేదీన జరగబోయే పోలింగ్‌లో హస్తం గుర్తు విజయం తథ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -