Sunday, February 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉప్లూర్ ఖబ్రస్థాన్ లో వీధిలైట్ల ఏర్పాటు

ఉప్లూర్ ఖబ్రస్థాన్ లో వీధిలైట్ల ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ ఖబ్రస్థాన్ లో ఆదివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వీధిలైట్ల ఏర్పాటు చేశారు.ఖబ్రస్థాన్ లో విధి దీపాలు లేకపోవడంతో రాత్రిపూట అంత్యక్రియలు చేసేందుకు వెలుతురు లేక ఇబ్బంది పడుతున్నామని సమస్యను  సర్పంచ్ ఎనుగందుల శైలేందర్ దృష్టికి దూదేకుల ముస్లిం మైనార్టీ సంఘం సభ్యులు తీసుకెళ్లారు. తక్షణమే  స్పందించిన సర్పంచ్ శైలేందర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఖబ్రస్థాన్ లో విద్యుత్ స్తంభాలతో పాటు విద్యుత్ తీగలను అమర్చి  లైట్లు బిగింప చేశారు. సమస్యను తన దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి ఖబ్రస్థాన్ లో విద్యుత్ సౌకర్యం కల్పించిన సర్పంచ్ శైలేందర్ కు దూదేకుల ముస్లిం మైనార్టీ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దూదేకుల ముస్లిం మైనార్టీ సంఘం పెద్దమనుషులు అబ్దుల్ ఫారక్, రఫీ, సదుల్లా, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -