నవతెలంగాణ-హైదరాబాద్: క్రికెట్ ఆట అనగానే ఓ పది దేశాల జట్లలకు కేరాఫ్ అడ్రస్. ఆ ఆటలో బెస్ట్ టీంలుగా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంక దేశాల పేర్లు ఇప్పటికి ఎప్పటికీ మోరుమోగుతాయి. దానికి కారణంగా అంతగా ఆ దేశాల పేర్లు జనాల నోట్లోనే కాదు..గూగుల్ లో సోదించిన ఆది కూడా ఆయా దేశాల జట్లనే క్రికెట్ ఆటలో నెంబర్ అని చెప్పుతుంది. కాకపోతే ఇంకా రెండు దేశాలైన, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్ నెమరుచేస్తుంది. కానీ ఈసారి భారత్-శ్రీలంక వేదికలుగా ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొన్న నేపాల్, యూఎస్ఏ, నెదర్లాండ్, స్కాట్లాండ్, ఇటలీ తదితర దేశాల టీంలు..క్రికెట్ ఆటకు కేరాప్ అడ్రస్‌గా నిలిచిన జట్లుకు గట్టి పోటీ ఇస్తున్నాయి. తామేమి తక్కువ కాదంటూ..టైటిల్ పోటీకి తాము సంసిద్ధమంగా వచ్చామంటూ తమ తొలి మ్యాచ్ ఆటతోనే మేటీ టీంలకు సవాల్ విసురుతున్నాయి.
టోర్నీ ప్రారంభం మ్యాచ్ శ్రీలంక వేదికగా పాకిస్థాన్-నెదర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డచ్చి పేయర్లు తమ ఉత్తమ ప్రతిభను కనబర్చించారు. 20 ఓవర్లగాను 145 రన్స్ చేసి పాక్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచారు. కానీ చేధనకు దిగిన పాక్ టీంకు విజయం సనాయాసంగా తగ్గలేదు. చివరి బంతి వరకు చెమడొచ్చారు. ఓపెనర్లు మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ముషప్ర్ పుణ్యమంటూ పాక్ తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
అదే విధంగా టీమిండియా కూడా తన తొలి మ్యాచ్‌లో భంగపాటు ఎదురైంది. టీ20 ఫార్మాట్లో భీకర్ ఫామ్‌లో ఉన్నా సూర్యసేనకు యూఎస్ఏ టీం పెద్ద సవాల్ విసిరింది. ఇద్దరు భారత్ స్టార్ హిట్టర్లను డకౌట్ గా పెవిలియన్ చేర్చారు. మెరుపుల రింక్ సింగ్, హర్థిక పాండ్యాలను సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేశారు. యూఎస్ఏ బౌలర్ల ధాటికి 5 ఓవర్లకే టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. దీంతో జట్టు కెప్టెన్ సూర్యకుమార్ ఒంటరీ పోరాటంతో భారత్‌కు గౌరవపదమైన స్కోర్‌ను అందించాడు. ఆ తర్వాత చేధనకు దిగిన యూఎస్ఏ బ్యాటర్లను కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత్ బౌలర్ల కట్టడి చేశారు. దీంతో తొలి మ్యాచ్‌లో టీమిండియా విక్టరీ సాధించింది.
క్రికెట్‌కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లాండ్ జట్టును కూడా నేపాల్ ఓ ఆట ఆడుకుంది. తనదైన బౌలింగ్, బ్యాటింగ్ తో బ్రిటన్ టీంను బెంబేలెత్తించింది. కేవలం 4పరుగులతో తేడాతో నేపాల్ టీం ఓటమిని చవిచూసింది. టోర్నీలో తమకు ఎదురులేదని వీర్రావీగుతున్న మేటీ జట్లకు ఆదిలోనే చిన్న టీంలుగా భావించే నేపాల్, యూఎస్ఏ, నెదర్లాండ్ టీంలు తమ సత్తా ఏంటో వాటికి రుచి చూపించాయి. ఆయా గ్రూపుల్లోని మేటీ జట్లు.. తాజా ఆటతో గుణపాఠం నేర్వకపోతే..టైటిల్ కోల్పోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. ఆయా టీంల ఆటతీరుతో క్రికెట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన జట్ల సంఖ్యలో భవిష్యత్‌లో మార్పులు రానున్నాయి.



